Udayanidhi Stalin as Deputy CM of Tamil Nadu: తమిళనాడు డిప్యూటీ సీఎంగా స్టార్ హీరో ఎంపికయ్యాడు. తమిళనాడు క్యాబినెట్ ను విస్తరించారు తమిళనాడు సీఎం స్టాలిన్. ఈ తరుణంలోనే కుమారుడు ఉదయనిది స్టాలిన్ కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు. దీంతో నేడు డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఉదయనిధి స్టాలిన్. అంతేకాదు… ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలికారు.
మరికొందరికి శాఖల మార్పు చేశారు. ఈడీ కేసులో విచారణ ఎదుర్కొంటు బెయిల్ పై విడుదలైన సెంథిల్ బాలాజీ కి మళ్లీ మంత్రిగా అవకాశం ఇచ్చిన స్టాలిన్… కుమారుడు ఉదయనిది స్టాలిన్ కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు. దీంతో తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ బాధ్యతలు తీసుకుంటున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రమాణ స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. మరి దీనిపై ప్రతి పక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.