రానున్న ఐదేళ్లలో అందుబాటులోకి 3వేల కొత్త రైళ్లు : రైల్వే మంత్రి వైష్ణవ్

-

రానున్న ఐదేళ్లలో భారత రైల్వే రంగం మరింత అభివృద్ధి కానుంది కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రైల్వే ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా.. దానికి తగ్గట్లుగా వసతులు కల్పిస్తామని వివరించారు. రానున్న ఐదేళ్లలో మూడు వేల కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం ఏటా రైళ్లలో 800 కోట్ల మంది ప్రయాణిస్తుండగా.. ఆ సామర్థ్యాన్ని వేయి కోట్లకు పెంచడంపై ఫోకస్ చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రస్తుతం రైల్వేవద్ద 69,000 కొత్త కోచ్‌లు అందుబాటులో ఉండగా.. ఏటా సుమారు 5,000 కోచ్‌లు అదనంగా తీసుకువచ్చి ప్రతి ఏడాది 200-250 కొత్త రైళ్లను పెంచుతున్నట్లు వివరించారు. కొత్త రైళ్లను తీసుకురావడమే కాకుండా రైల్వే వ్యవస్థను పటిష్ఠం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అన్ని పెట్టెల్లో పుష్‌-పుల్‌ విధానాన్ని ప్రవేశపెట్టి, ప్రయాణ సమయం తగ్గేలా చూస్తామన్న వైష్ణవ్.. స్లీపర్‌ పెట్టెలను తగ్గించి, ఏసీ కోచ్‌లను పెంచుతున్నామన్న వాదనను మంత్రి తోసిపుచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version