12ఏళ్ల బాలికపై రేప్.. 27ఏళ్ల తర్వాత నిందితుడు అరెస్ట్..

అత్యాచారం జరిగిన 27ఏళ్లకు నిందితుడిని అరెస్ట్ ఘటన ఉత్తర్​ప్రదేశ్ షాజహన్​పుర్​లో చోటు చేసుకుంది. 12ఏళ్ల వయసులోనే బాధితురాలు అత్యాచారానికి గురైంది. ఆమె ఇంటికి పొరుగున ఉండే నకి హసన్, మహమ్మద్ రాజి అలియాస్ గుడ్డు అనే ఇద్దరు సోదరులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె గర్భవతి అయి.. ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

ఈ ఘటనపై 27ఏళ్ల క్రితమే బాధితురాలు కేసు పెట్టారు. నిందితులిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు పోలీసులు. అనంతరం, వారి డీఎన్ఏ వివరాలు సేకరించారు. గుడ్డు డీఎన్ఏ.. బాధితురాలికి పుట్టిన బిడ్డ డీఎన్ఏతో సరిపోలింది.

అయితే, ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న సదర్ బజార్ పోలీస్ స్టేషన్​ 27ఏళ్ల తర్వాత నిందితుడిని పట్టుకున్నారు. మంగళవారం అతడిని అరెస్టు చేసి.. జైలుకు తరలించారు.