రాష్ట్రపతి ముర్ముకు మమతాబెనర్జీ క్షమాపణ.. ఎందుకంటే..?

-

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ క్షమాపణ కోరారు. రాష్ట్రపతిని క్షమాపణ కోరుతున్నానని మీడియా వేదికగా చెప్పారు. ఇవాళ నబన్నాలో మీడియా సమావేశంలో మాట్లాడిన మమత.. ‘రాష్ట్రపతి చాలా మంచి మహిళ. అఖిల్‌గిరి చేసింది తప్పు. నేను క్షమాపణ కోరుతున్నా. మా ఎమ్మెల్యే తరఫున నేను క్షమాపణ కోరుతున్నా. ఐయామ్‌ సారీ’ అని తెలిపారు

ఈస్ట్‌ మిడ్నాపూర్‌లోని రామ్‌నగర్‌కు చెందిన ఎమ్మెల్యే, బెంగాల్‌ జైళ్ల శాఖ మంత్రి అఖిల్‌గిరి గత శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి అవమానకర వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్‌లో బెంగాల్‌ బీజేఎల్పీ నేత సువేందు అధికారిపై విమర్శలు చేస్తూ అఖిల్‌గిరి నోరుజారారు. సువేందు అధికారిని ఉద్దేశించి మేం మనుషుల రూపు చూసి జడ్జి చేయం. రాష్ట్రపతి కుర్చీని గౌరవిస్తాం. కానీ, మీ రాష్ట్రపతి చూడ్డానికి ఎలా ఉంది..? అని వ్యాఖ్యానించారు.

అఖిల్‌గిరి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పారు. తాజాగా నబన్నాలో ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ మమతాబెనర్జి కూడా రాష్ట్రపతికి క్షమాపణలు తెలియజేశారు. మా పార్టీలో ఎవరైనా పొరపాటు చేస్తే తాము వ్యతిరేకిస్తామని అన్నారు. అలాంటి వాటిని తాము సహించమని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news