WTC ఫైనల్లో భారత జట్టు ప్రదర్శనపై తీవ్ర విమర్శల నేపథ్యంలో మాజీ కెప్టెన్ ధోనిని నెటిజన్లు గుర్తు చేస్తూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఇలాంటి మ్యాచుల్లో మిస్టర్ కూల్ సారాధ్యాన్ని మిస్ అవుతున్నామని, అతడు ఉండుంటే మ్యాచ్ గెలిచే వాళ్ళమని అంటున్నారు. 2013 తర్వాత ఇతర ఆటగాళ్ల కెప్టెన్సీలో ICC ట్రోఫీని దక్కించుకోవడంలో భారత్ విఫలమైందని చెబుతున్నారు.
ప్రస్తుత కెప్టెన్ రోహిత్ ప్రదర్శనను తప్పుబడుతున్నారు. ఇది ఇలా ఉండగా, WTC ఫైనల్ మ్యాచ్ షెడ్యూలింగ్, వేదికపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేశారు. WTC ఫైనల్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ‘IPL ఫైనల్ తర్వాతే WTC ఫైనల్ ఎందుకు షెడ్యూల్ చేయాలి. అది కూడా ఇంగ్లాండ్ లోనే ఎందుకు ఆడించాలి. ఏడాదిలో ఎప్పుడైనా, ఎక్కడైనా ఆడించొచ్చు కదా. మార్చిలో ఎందుకు నిర్వహించకూడదు’ అని వ్యాఖ్యానించారు. WTC 2021 ఫైనల్ ను కూడా ఇంగ్లాండ్ లోనే జూన్ లో నిర్వహించారు.