‘రామారావు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​కు నేచురల్ స్టార్ నాని

-

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తోన్న చిత్రం రామారావు.. ఆన్ డ్యూటీ. ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. ఇవాళ హైదరాబాద్​లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్​కు నేచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్​గా రాబోతున్నారు.

రామారావు సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్లలో రవితేజ చాలా స్టైలిష్​గా కనిపిస్తున్నారు. ఈ మూవీలో రవిజేత ప్రభుత్వాధికారిగా నటిస్తున్నారు. శరత్‌ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన ఇద్దరు కథనాయికలు రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ సందడి చేయనున్నారు.

యదార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ శరత్ తెలిపారు. ఈ మూవీకి సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. జులై 29న ఈ సినిమా విడుదల జరగనున్నట్లు సమాచారం. ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్​లో ఓవైపు మాస్ మహారాజ.. మరోవైపు నేచురల్ స్టార్ ఇలా ఒకే వేదికపై ఇద్దరు సెల్ఫ్ మేడ్ స్టార్లు కనిపించి అభిమానుల్లో జోష్ నింపనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news