సత్ప్రవర్తన కారణంగా ముందే జైలు నుంచి విడుదలైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ…

-

మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ 34 ఏళ్ల నాటి కేసులో ఏడాదిగా జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సిద్ధు కి ఇప్పుడు ఈ కేసు నుండి విడుదల కలిగింది. సత్ర్పవర్తన కారణంగా సిద్ధూ ముందుగానే విడుదలయ్యారని సమాచారం. ఈరోజు సాయంత్రం ఆయన పాటియాలా జైలు నుంచి విడుదలయ్యి బయటికి అడుగుపెట్టారు. 1988లో సిద్ధూ, ఆయన స్నేహితుడు రూపిందర్ సింగ్… ఓ పార్కింగ్ వివాదంలో గుర్నామ్ సింగ్ అనే వృద్ధుడిపై చేయిచేసుకున్నట్టు అభియోగాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గుర్నామ్ సింగ్ ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటూ ప్రాణాలు విడిచాడు.

Sidhu released form prison

ఈ కేసులో సిద్ధూకు ఏడాది జైలు శిక్ష పడింది. దీంతో సిద్ధు గతేడాది కోర్టు ఎదుట తప్పు ఒప్పుకొని లొంగిపోయాడు. ఇటీవల సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ క్యాన్సర్ కు గురైంది. ఈ కష్టకాలంలో భర్త తన వెంట ఉండాలని కోరుకుంటున్నానని ఆమె వెల్లడించారు. కాగా, సిద్ధూ స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చిన నేపథ్యంలో, ఆయన రాజకీయ భవితవ్యం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి అనంతరం పంజాబ్ పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకున్నారు సిద్ధూ. అటు, పార్టీలో జరిగిన గొడవల్లోను , కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహానికి గురయ్యారు సిద్ధూ.

 

 

Read more RELATED
Recommended to you

Latest news