కాంగ్రెస్ నేత, వెటరన్ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ పది నెలల శిక్షానంతరం శనివారం పాటియాలా జైలు నుంచి విడుదల అయ్యారు. 34 ఏళ్ల క్రితం కారు పార్కింగ్ విషయంలో తలెత్తిన ఓ గొడవకు సంబంధించిన కేసులో దాదాపు ఏడాది జైలు శిక్ష పూర్తి చేసుకున్న సిద్ధూ నేడు విడుదల అయ్యారు. 1988 డిసెంబర్ 27న కారు పార్కింగ్ విషయంలో గురునాం సింగ్ అనే వ్యక్తితో సిద్దు, ఆయన స్నేహితుడు రూపిందర్ సింగ్ గొడవపడ్డారు.
గురునాం సింగ్ ను కారు బయటకు లాగి తీవ్రంగా కొట్టారు. దీంతో తీవ్ర గాయాలైన ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు సిద్ధూ పై కేసు పెట్టారు. గతేడాది ఈ కేసును విచారించిన సుప్రీం కోర్ట్ సిద్దునీ దోషిగా తేలుస్తూ ఏడాది జైలు శిక్ష విధించింది. అయితే జైలలో ఆయన సత్ప్రవర్తన కారణంగా ముందుగా పది నెలల్లోనే విడుదల అయ్యారు సిద్దు.