కరోనాతో మరణించిన వారికి అందించే పరిహారంపై సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనాతో చనిపోయిన వారికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారీటీ(NDMA) సూచించిన విధంగా రూ. 50 వేల చెల్లించాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. ఏ రాష్ట్రం కూడా ఇవ్వడానికి నిరాకరించ రాదని స్పష్టం చేసింది. జస్టిస్ షా, బోపన్నతో కూడిన ధర్మాసనం NDMA మార్గధర్మకాలను ఆమోదించింది. దరఖాస్తు అందిన 30 రోజుల్లోగా బాధిత కుటుంబానికి పరిహారం అందాలని సూచించింది.
మరణద్రువీకరణ పత్రంలో కరోనాతో చనిపోలేదనే దాన్ని కారణంగా చూపరాదని తెలిపింది. అప్పటికే మరణద్రువీకరణ పత్రాలు జారీ చేస్తే దానిలో మార్పు కోసం సంబంధిత అధికారులను మళ్లీ సంప్రదించవచ్చని తెలిపింది. RTPCR టెస్ట్ కు సంబంధించిన పత్రాలను సమర్పిస్తే సంబంధిత అధికారులు మార్పులు చేయాలని సూచించింది. కరోనాతో మరణించిన వారికి రాష్ట్రాలు విపత్తు సహాయక నిధి నుంచి పరిహారం అందించాలని ఆదేశించింది.