జనగామ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరికొన్ని ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లింగాల ఘనపూర్ మండలం చీటూర్-కన్నాయిపల్లి గ్రామాల మధ్య వాగు పొంగిపొర్లింది. ఈ వాగుకు వరద ప్రవహాం పోటెత్తింది.
వ్యవసాయ పనుల కోసం నిన్న ఉదయం ఈ వాగు దాటి వెళ్లిన 14 మంది కూలీలు తిరుగుప్రయాణంలో వాగులో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం 14 మంది కూలీలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఎన్డీఆర్ఎఫ్ బృందానికి స్థానిక సీఐ వినయ్, ఎస్సైలు, పోలీసు సిబ్బంది సాయం చేశారు. దాదాపు 7 గంటల పాటు శ్రమించి 14 మంది కూలీలను రక్షించారు. అధికారులు వచ్చి తమను కాపాడే వరకు కూలీలంతా చీటూర్ గ్రామ స్మశాన వాటికలో తలదాచుకున్నారు. వాగులో చిక్కుకున్న వారి వివరాలు..
1)నోముల ప్రశాంత్
2) నోముల శ్రీశైలం.
3)రవికంటి నరేందర్.
4)రవికంటి విమల.
5)నోముల ఉప్పమ్మ
6)ఐల ఉప్పమ్మా
7)ఐల అంజమ్మ
8)ఐల సుమలత
9)ఐల లక్ష్మీ
10)ఐల సోమయ్య
11)ఐల లచమ్మ
12)మహమూద
13)ఏలిశాల ప్రమీల
14)ఐల అంజమ్మ