క్లోజప్ సెల్ఫీలతో కాక పుట్టిస్తున్న నిహారిక..!

-

మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఢీ షోలో యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించి మెప్పించింది. ఇక మెగా ఫ్యామిలీ నట వారసత్వాన్ని వంట పట్టించుకొని పలు వెబ్ సిరీస్లలో కూడా సందడి చేసింది. ముఖ్యంగా టాలీవుడ్ లో ఎన్ని ఫ్యామిలీలు ఉన్నా మెగా ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందుకే వాళ్లకు సంబంధించిన ఏ విషయం అయినా సరే అది చాలా వైరల్ గా మారుతూ ఉంటుంది. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ కూడా నిహారిక మాత్రమే కావడం గమనార్హం. ఇక మెగా ఫ్యామిలీలో నిహారికను ఎంత గారాబంగా చూసుకుంటారో అందరికీ తెలిసిన విషయమే.

ఈ క్రమంలోని ఇటీవల నిహారికను చైతన్య అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె నిర్మాతగా వ్యవహరిస్తోంది. నిజానికి చైతన్యకు ఇష్టం లేకపోవడం వల్ల నిహారిక సినిమాలలో నటించడం లేదట.

ఎప్పుడు బుల్లితెర ఈవెంట్ లలో సందడి చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె జోర్డాన్ దేశంలో వెకేషన్ కి వెళ్లి అక్కడ బాగా ఎంజాయ్ చేసింది. ఈ నేపథ్యంలోనే అప్పట్లో దిగిన ఒక క్యూట్ ఫోటో ఇప్పుడు షేర్ చేసి ఆ ఫోటోలో ఉన్న షేడ్స్ చూసి టైం ఎంతో చెప్పాలని ఫాలోవర్స్ కి పజిల్ ఇచ్చింది.

దీంతో ఆ ఫోటో అప్పట్లో ట్రెండింగ్ గా మారినా ఇప్పుడు తాజాగా మళ్లీ నిహారిక సెల్ఫీ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. నిహారిక షేర్ చేసుకున్న ఈ ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా ఈ అందాల ముద్దుగుమ్మ మరింత అందంగా కనిపిస్తోందని చెప్పడంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news