‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ ట్రైలర్‌ రిలీజ్

-

యూత్ స్టార్ కిరణ్ అబ్బవరం నటించిన ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమా ట్రైలర్ విడుదలైంది. కూతురు పుడితే కొందరు తండ్రులు ఎందుకు ఆనందంగా ఉంటారో వివరించే సన్నివేశంతో ప్రారంభమైంది ట్రైలర్‌. కామెడీ, యాక్షన్‌, ఎమోషన్‌.. ఇలా అన్ని అంశాలతో ఈ సినిమా రూపొందినట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. డ్రైవర్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ల ప్రేమకథ ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కినట్టు తెలుస్తోంది. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌ ఈ నెల 16 ప్రేక్షకుల ముందుకురానున్న నేపథ్యంలో ప్రముఖ నటుడు పవన్‌ కల్యాణ్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

‘నీ కూతురు ప్రేమించినవాడిని కదా.. నన్ను మెతక అనుకుంటున్నావేమో.. కాస్ట్యూమ్‌, కళ్లజోడు చూస్తే అర్థంకావట్లేదా? మాస్‌.. ఊర మాస్‌’ అంటూ తనకు కాబోయే మావయ్యకు వార్నింగ్‌ ఇచ్చారు కిరణ్‌ అబ్బవరం. ‘మగతనం అంటే మామూలుగా ఉన్న అమ్మాయితో మంచిగా ఉండటం కాదు తాగి ఉన్న అమ్మాయితో కూడా మిస్‌ బిహేవ్‌ చేయకుండా ఉండటం’,  ‘అబ్బాయిలు ఇంతగా తాగాలంటే పెద్ద కారణం ఉండాల్సిన అవసరంలేదు. కానీ, ఓ అమ్మాయి ఇంతలా తాగుతుందంటే ఏదో బలమైన కారణమే ఉండాలి’ అని కథానాయకుడు చెప్పిన సంభాషణలు యువతను మెప్పించేలా ఉన్నాయి.

తమ తమ పాత్రలతో గెటప్‌ శ్రీను, బాబా భాస్కర్‌ నవ్వులు పంచారు. ఈ సినిమాలో కిరణ్‌ సరసన సంజనా ఆనంద్‌, సోనూ ఠాకూర్‌ సందడి చేయనున్నారు. శ్రీధర్‌ గాదె దర్శకత్వం వహించిన ఈ సినిమాని దివంగత కోడి రామకృష్ణ తనయ దివ్య నిర్మించారు. మణిశర్మ స్వరాలందించారు.

Read more RELATED
Recommended to you

Latest news