నేపాల్ ఘోర విమాన ప్రమాదంలో 22 మంది చనిపోయారు. తారా ఎయిర్ కు చెందిన టర్బోప్రోప్ ట్విన్ ఇంజిన్ విమానం ఆదివారం పోఖారా నుంచి జమ్సన్ వెళ్తున్న క్రమంలో హిమాలయ పర్వతాల్లో కుప్పకూలింది. ముస్తాంగ్ జిల్లాలోని మనపతి శిఖరం వద్ద 14,500 అడుగుల ఎత్తులో కూలిపోయింది. గమ్యస్థానానికి మరో 5 నిమిషాల దూరంలో ఈ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు భారతీయులు, 2 జర్మనీ దేశస్థులు, మిగిలిన వారంతా నేపాల దేశానికి చెందిన వారు ఉన్నారు. హిమాలయాల్లో మంచు పరిస్థితుల వల్ల డెడ్ బారీల రికవరీ కాస్త కష్టం అవుతోంది.
ప్రమాదంలో మరణించిన 22 మంది ప్రయాణికులు శవాలను నేపాల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరొక డెడ్ బాడీ కోసం గాలింపు చేపడుతున్నారు. ఇప్పటి వరకు 10 డెడ్ బాడీలను బేస్ క్యాంపుకు హెలికాప్టర్ల ద్వారా తరలించారు. దాదాపు 50 మంది దాకా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. తీవ్ర మంచు పరిస్థితులు, గాలులు డెడ్ బాడీల తరలింపుకు ప్రతిబంధకంగా మారాయి.