Pushpa: స్టార్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుక రానున్నారు. ఫస్ట్ పార్ట్.. పుష్ప ది రైజ్ డిసెంబర్ నెల 17వ తేదీన రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో సినిమా రిలీజ్ డేట్ లో మార్పు లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో మూవీ యూనిట్ ప్రమోషన్ పర్వాన్ని వేగవంతం చేసింది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై ఎంతో ఆసక్తిని పెంచుతున్నాయి. తాజా ఈ చిత్ర బృందం మరో బిగ్ సర్ ప్రైజ్ వచ్చేసింది. ఈ సినిమాలో సునీల్ ఇంట్రెస్టింగ్ రోల్ ను ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ పాత్ర పేరే మంగళం శ్రీను. ఈ పాత్రకు సంబంధించిన పోస్టర్ రిలీజైంది చిత్ర బృందం.
సాధారణంగా కమెడియన్ గా నవ్వించే సునీల్ .. ఇప్పడూ మంగళం శ్రీను లుక్ చూస్తే.. కాస్త భయం కలిగించేలా ఉంది. సునీల్ లుక్‌ను పరిశీలిస్తే.. సునీల్ తలపై పెద్దగా వెంట్రుకలు లేవు. పిల్లి కండ్లు.. చేతికి పెద్దపెద్ద ఉంగరాలు, మెడలో చైన్స్, చేతిలో ఫోన్ తో చాలా బీభత్సంగా కనిపిస్తున్నాడు.
ఇదిలాఉంటే.. సునీల్ పోస్టర్ పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి, మంగళం శ్రీను పాత్రతో సునీల్ తన దారిద్రానికి మంగళం పాడబోతున్నాడని, ఈ పాత్రతో సునీల్ జాతకం మారుతుందని కొంతమంది కామెంట్లు చేస్తుండగా మరి కొందరు మాత్రం సుకుమార్ కు భయం పుట్టేలా.. షాకింగ్ కామెంట్స్ పెడుతున్నారు. పుష్పరాజ్ కు చుక్కులు చూపిస్తాడో లేదో తెలియదు కానీ, సుకుమార్ కు మాత్రం కచ్చితంగా చుక్కలు కనిపిస్తాయని కామెంట్ చేస్తున్నారు. ఏదిఏమైనా.. ఇప్పటి వరకూ సునీల్ కనిపించని సరికొత్త గెటప్‌లో.. పుష్ప సినిమాలో కనిపించ బోతున్నాడని ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది.
ఈ సినిమాలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిద్ భైరవ్ సింగ్ షెకావత్ అనే ఐపీయస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. సునీల్ ఒకవేళ విలన్‌గా నటిస్తుంటే.. మాత్రం తను టెరిఫిక్ విలన్‌గా కనిపించే రెండో సినిమా ఇదే అవుతుంది. తొలుత డిస్కోరాజా సినిమాలో సునీల్ మెయిన్ విలన్‌గా నటించి, మెప్పించాడు. అయితే ఈసారి సుకుమార్ పాత్రను ఎలా చూపించబోతున్నాడనేది అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంపై లెక్కల మాస్టార్ భారీగా అంచనాలు పెంచుకున్నట్టు అర్థమవుతుంది. మరీ 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై ఆ అంచనాలను అందుకుంటాడో లేదో చూడాల్సి ఉంది.