Breaking : సింగపూర్‌లో కలకలం రేపుతున్న మరో కరోనా వేవ్‌

-

యావత్తు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేసిన కరోనా మహమ్మారి కొత్త కొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతోంది. అయితే.. ప్రస్తుతం సింగపూర్‌లో మరో కొత్త కరోనా వేవ్‌ను ఎక్స్‌బీబీ సబ్ వేరియంట్ వైద్యులు గుర్తించారు. సింగపూర్‌లో ఈ వేవ్‌ విజృంభిస్తోంది. దీంతో ఆ దేశంలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతు వస్తోంది. అక్టోబర్‌ 3 నుంచి 9 వరకు 54 శాతంపైగా కరోనా కేసులు ఎక్స్‌బీబీ సబ్ వేరియంట్‌వేనని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఓంగ్ యే కుంగ్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, డెన్‌మార్క్‌, భారత్‌, జపాన్‌తో సహా 17 దేశాల్లో ఈ కరోనా వేరియంట్‌ను గుర్తించినట్లు ఓంగ్ యే కుంగ్ తెలిపారు. ఎక్స్‌బీబీ సబ్ వేరియంట్ విజృంభణతో తమ దేశంలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందని ఓంగ్ యే కుంగ్ వెల్లడించారు. అలాగే కరోనా నుంచి కోలుకున్న వారికి కూడా తిరిగి వ్యాపిస్తుందని తెలిపారు.

Singapore to isolate fewer foreign workers in new coronavirus policy | Mint

మరోవైపు ఎక్స్‌బీబీ సబ్‌ వేరియంట్‌ వల్ల కరోనా కేసులు నవంబర్ నెల మధ్యలో గరిష్ఠస్థాయికి చేరవచ్చని తెలిపింది సింగపూర్‌ ప్రభుత్వం. ఈ వేవ్‌ పీక్‌ స్టేజ్‌లో ప్రతి రోజు సగటున 15,000 కేసులు నమోదు కావచ్చని అంచనా వేసింది సింగపూర్‌ ప్రభుత్వం. అయితే ఈ వేవ్‌ స్వల్ప కాలం పాటు ఉండవచ్చని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఓంగ్ యే కుంగ్ చెప్పారు. తాజా కరోనా పరిస్థితిని, ఆరోగ్య వ్యవస్థపై ప్రభావాన్ని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు అధికారులు. అవసరమైతే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ తప్పనిసరి చేయడంతోపాటు సురక్షిత పద్ధతులను అమలు చేస్తామని ఓంగ్ యే కుంగ్ అన్నారు. వర్క్‌ ఫ్రం హోమ్‌ను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, అక్టోబర్ 14 నాటికి సింగపూర్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,997,847కు, మొత్తం మరణాల సంఖ్య 1,641కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news