హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్‌.. న్యూఇయర్‌ వేళ మరో ఫ్లై ఓవర్‌ షురూ

-

హైద‌రాబాద్ వాసుల‌కు నూతన సంవవత్సర కానుకగా మ‌రో నూత‌న ఫ్లై ఓవ‌ర్ అందుబాటులోకి రానుంది. కొత్త‌గూడ ఫ్లై ఓవ‌ర్‌ను మంత్రి కేటీఆర్ ఆదివారం ప్రారంభించ‌నున్నారు. రూ. 263 కోట్ల వ్య‌యంతో 3 కిలోమీట‌ర్ల మేర ఈ ఫ్లై ఓవ‌ర్‌ను నిర్మించారు. కొత్త‌గూడ ఫ్లై ఓవ‌ర్ ప్రారంభంతో కొండాపూర్, గ‌చ్చిబౌలి వాసుల‌కు ట్రాఫిక్ క‌ష్టాలు తీర‌నున్నాయి. మూడు కిలోమీటర్ల పొడవుతో చేపట్టిన ఈ ఫ్లై ఓవర్‌కు అనుబంధంగా 470 మీటర్ల పొడవుతో 11 మీటర్ల వెడల్పుతో అండర్‌ పాస్‌ను కూడా చేపట్టి అధికారులు పూర్తి చేశారు.

Happy birthday KTR: Dynamic Leader to celebrate birthday with a 'Gift a  Smile' program

ఇందులో 65 మీటర్ల పొడవుతో క్లోజ్డ్‌ బాక్స్‌ 425 మీటర్ల ఓపెన్‌ బాక్స్‌ గల అండర్‌ పాస్‌ చేపట్టారు. కాగా కొత్తగూడ ఫ్లై ఓవర్‌ వల్ల గచ్చిబౌలి, కొండాపూర్‌ వాసులు ప్రయోజనం పొందుతారు. గచ్చిబౌలి నుంచి మియాపూర్‌ వరకు, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి హైటెక్‌ సిటీ వరకు కనెక్టివిటీతో పాటు పరిసర ప్రాంతాలను కలుపుతుంది. ఈ వంతెన వల్ల బొటానికల్‌ గార్డెన్‌, కొత్తగూడ జంక్షన్‌లలో 100 శాతం ట్రాఫిక్‌ సమస్య పరిషారం అవడమే కాకుండా కొండాపూర్‌ జంక్షన్‌లో 65 శాతం ట్రాఫిక్‌ సమస్య తీరుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news