Big News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక అమ్మాయిలపై చేయివేస్తే అంతే..!

-

రోజు రోజు రాష్ట్రంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణాలో పాఠశాలలు, కళాశాలల్లో అమ్మాయిల మీద అఘాయిత్యాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకువస్తోంది. ఇటీవల హైదరాబాదులోని డీఏవీ స్కూలులో చిన్నారిపై అత్యాచారం జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రత్యేక చట్టంపై దృష్టి పెట్టింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ దీనిపై మాట్లాడారు.

CP CV Anand rewards Police personnel, civilians as part of quarterly reward  mela - Telangana Today

అమ్మాయిలపై ఏదైనా ఘటన జరిగితే సదరు స్కూలు, కాలేజీ యాజమాన్యాలను బాధ్యులను చేయడం ఈ చట్టంతో సాధ్యమవుతుందని వివరించారు సీవీ ఆనంద్. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీల్లో చిన్నారులపై, యువతులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ చట్టంతో మెరుగైన ఫలితాలు వస్తాయని భావిస్తున్నామని పేర్కొన్నారు సీవీ ఆనంద్. ఇక డ్రగ్స్ అంశంపైనా ఆయన స్పందించారు. గోవా డ్రగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిందని, గోవాలో ఉండి హైదరాబాదులో డ్రగ్స్ అమ్ముతున్నవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు సీవీ ఆనంద్.

Read more RELATED
Recommended to you

Latest news