మనకు ఉండే కొన్ని చెడు అలవాట్లు కూడా ఒక్కోసారి మనకు మంచే చేస్తాయి..గాసిప్స్ అంటే చాలామందికి ఎక్కడలేని ఇంట్రస్ట్ వచ్చేస్తుంది. అవి వినాలన్నా, చెప్పాలన్నా భలే మజాగా ఉంటుంది కదూ.. అసలు కుర్చోని సరదాగా కబుర్లు చెప్తుంటే ఎంత బాగుంటుంది.. టైమ్ ఎంత అయినా తెలియదు..ఆడవాళ్లకు ముఖ్యంగా కబుర్లు చెప్పడం అంటే బాగా ఇష్టం.. ఇది మితిమీరితే లేనిపోని తలనొప్పులు తెస్తుంది కానీ..ఇలా ముచ్చట్లు చెప్పడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఇది ఏమంత చెడ్డ అలవాటు కాదు.. మంచి అలవాటే అంటున్నారు. ఇంకా కొన్ని చెడు అలవాట్లు మనకు ఏవిధంగా మంచి చేస్తాయో చూద్దామా..!
గోర్లు కొరకడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి లేదా సంతోషం కావచ్చు, చాలా మందికి ప్రతి సందర్భంలోనూ గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. గోరు కొరకడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పళ్లతో గోళ్లు కొరకడం వల్ల శరీరంలో కొత్త బ్యాక్టీరియా ఏర్పడి భవిష్యత్తులో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందట.
చాలా మందికి గమ్ నమలడం అలవాటు. ఇది తరచుగా చికాకుకు దారితీస్తుంది. చూయింగ్ గమ్ దృష్టి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చూయింగ్ గమ్ కెఫిన్ కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉండవచ్చు. ఇది ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది, ఇది మీకు ఎక్కువ సమయం పాటు దృష్టి పెట్టడంలో సహాయపడుతుందట.. పైగా ఫేస్ ఎక్సర్‌సైజ్ కూడా..
ఆలస్యంగా వచ్చే అలవాటుగా కొన్నిసార్ల మంచే చేస్తుంది. కొందరు వ్యక్తులు సమయానికి ఆఫీసుకు లేదా ఇంటికి చేరుకోరు. ఒక హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనం ప్రకారం.. వ్యక్తులకు సమయంపై శ్రద్ధ లేకపోతే..వారి ఒత్తిడి స్థాయిలు తక్కువగా ఉంటాయి. అలాగే వారు ఇతర వ్యక్తుల కంటే సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవనశైలిని నడిపిస్తారు. అలా అని మీ అలవాటు సమర్థించుకోకండే..!
కబుర్లు చెప్పడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఈ అలవాటు మంచిది కానప్పటికీ, ప్రతి ఒక్కరూ దీన్ని ఆనందిస్తారు. స్నేహితులు, బంధువులతో సహా ఇతరుల గురించి మాట్లాడటం, నవ్వడం, శరీరంలో మంచి అనుభూతిని కలిగించే హార్మోన్లను విడుదల చేస్తుంది.
సో..ఇది మ్యాటర్..ఇవి చెడు అలవాట్లే అయినప్పటికీ మనకు కొంతమేర మేలు చేస్తాయి.. కానీ వీటినే బాగా ఫాలో అయితే.. లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది.