కొత్తగా పెళ్ళైన జంటలు హోలీ రోజు ఈ తప్పులను చెయ్యకండి…ఎందుకంటే?

-

కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు హోలిక దహన్ను చూడడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు.. ఇలా చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో కొత్తగా వివాహం అయినవారు హోలీ రోజున ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతికగా జరుపుకునే పండుగ హోలీ పండుగ.హోలీ ఆడడానికి ఒకరోజు ముందు హోలిక దహన్ నిర్వహిస్తారు. ఈసారి మార్చి 7 వ తేదీన హోలిక దాహన్ ఉంటుంది.. అయితే ఈరోజున హోలిక దహన్ ను నూతనంగా వివాహమైన వారు చూడకూడదు అని పెద్దలు చెబుతారు. వారు ఆ రోజు ఇంకా ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. నూతన వధూవరులు హోలీ రోజున నల్లటి దుస్తులను ధరించడం మంచిది కాదు. ఎందుకంటే అది ఆశుభంగా భావిస్తారు. నలుపు రంగు అనేది ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుందని పూర్వీకులు చెబుతున్నారు..

అంతేకాకుండా పెళ్లి అయిన తర్వాత తొలిసారి హోలీ జరుపుకునే మహిళలు తెల్లని దుస్తులు ధరించకూడదు. వాటికి బదులుగా కొత్త వధువు పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులను ధరించవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే మత విశ్వాసాల ప్రకారం పెళ్లి తర్వాత మొదటి హోలీని కొత్త జంటలు తమ అత్తమామలా ఇంట్లో జరుపుకోకూడదు. ఇది ఇంటి ఆనందం మరియు శాంతిని ప్రభావితం చేస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు. కొత్త వధూవరులు అత్తమామల ఇంట్లో హోలీ ఆడడం అశుభవంగా భావిస్తారు..అంతేకాదు ఏదైనా అశుభం జరుగుతుందని అంటున్నారు. ఇకపోతే పెళ్లికి వచ్చిన కానుకలను వేరే వారికి ఇవ్వడం మంచిది కాదు.. ఇది గుర్తుంచుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news