పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కనున్న ‘ భవదీయుడు భగత్ సింగ్’ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని గతంలో వార్తలొచ్చాయి. ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ప్యారలల్ గా ఈ పిక్చర్ షూట్ కూడా షురూ చేయాలని మేకర్స్ అనుకున్నారట. కానీ, అలా కుదరడం లేదని సమాచారం.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమా, పాలిటిక్స్ రెండూ చేస్తు్న్న క్రమంలో ఒకే ఒక్క సినిమాకు డేట్స్ ఇస్తున్నారని వినికిడి. ఈ నేపథ్యంలో ‘భవదీయుడు భగత్ సింగ్ ’ ఫిల్మ్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్.
ఇక ఈ చిత్రంలో కథానాయికగా బుట్ట బొమ్మ పూజా హెగ్డేనే డైరెక్టర్ హరీశ్ శంకర్ ఫైనల్ చేశారని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ, పూజా హెగ్డే తనకున్న కమిట్ మెంట్స్ వలన ఈ చిత్రానికి నో చెప్పేసిందని మరొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ ఫ్యాన్స్, సినీ అభిమానులు బోలెడన్ని ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.