అందాల నిధి మొత్తం తెరచేసిన నిధి అగర్వాల్.. క్యూట్ గా ఉందంటూ.. ఫొటోస్ వైరల్..!!

-

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. ఈమె తన నటనతో, అందంతో తెలుగు కుర్రాళ్ళ క్రేజీ క్రష్ హీరోయిన్గా మారిపోయింది. అతి తక్కువ సమయంలోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. సవ్యసాచి సినిమాతో మొదటిసారి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె మొదటి సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ మూవీతో నిధికి పెద్దగా గుర్తింపు రాలేదు.

ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమాతో మరొకసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి నటనపరంగా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ , ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్లో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయిందని చెప్పవచ్చు.

ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఇప్పటికే విడుదలైన నిధి ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాతో ఈమె కథలో మరొక బ్లాక్ బస్టర్ విజయం తప్పనిసరి అంటూ వార్తలు వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

ఇక తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్ భాషల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు నిధి అగర్వాల్. ఇదిలా ఉండగా ఈరోజు ఈమె పుట్టినరోజు కావడంతో వైట్ కలర్ సారీ, బ్లౌజ్ ధరించి దేవకన్యlaa చూపర్లను ఆకట్టుకుంటుంది. అంతేకాదు తన అందాలను చూపిస్తూ మరింత కవ్విస్తోంది ఈ ముద్దుగుమ్మ. నిధి అగర్వాల్ అందానికి కుర్ర కారు సైతం ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version