బస్సులో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల ఓవరాక్షన్‌.. వీడియో వైరల్

-

తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న కొంత మంది మహిళలపై తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.. దైర్జన్యానికి దిగారు.

ఓ మహిళ చేతి నుంచి మొబైల్‌ ఫోన్‌ ను సైతం తీసుకుని.. వివాదానికి తెరలేపారు నిమ్మల రామానాయుడు. ఆ మొబైల్‌ ను లాక్కొని.. కింద వేసేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటన పాలకొల్లులో చోటు చేసుకుందని సమాచారం.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. నిమ్మల రామాననాయుడి వైఖరిపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళ పై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దౌర్జన్యం చేశాడని… వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news