9 రోజుల టూర్ ప్యాకేజీ… తెలుగు రాష్ట్రాల నుండే.. పూరీ, కోణార్క్, వారణాసి మొదలు ఈ ప్రదేశాలన్నీ చూసి వచ్చేయచ్చు…!

-

భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఆపరేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. పుణ్య క్షేత్ర యాత్ర అనే పేరు తో ఈ ప్యాకేజీ ని తీసుకు రావడం జరిగింది. ఇక ఈ టూర్ ప్యాకేజీ కి సంబంధించి పూర్తి వివరాలని చూసేద్దాం.. మన తెలుగు రాష్ట్రాల నుండి ఈ ప్యాకేజీ ని చాలా మంది బుక్ చేసుకుంటున్నారు. ఈ ఆధ్యాత్మిక యాత్రకు మంచి స్పందన వస్తోంది. మరో మూడు సార్లు భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్‌లో ఈ ప్యాకేజీ ని తీసుకు వస్తున్నారు. జూన్ 28, జూలై 12, జూలై 26 తేదీల్లో పుణ్య క్షేత్ర యాత్ర టూర్ ప్యాకేజీ మొదలు కానుంది. ఈ ప్యాకేజీ లో భాగంగా పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి.

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు పుణ్యక్షేత్ర యాత్ర టూర్ ప్యాకేజీ ని బుక్ చెయ్యవచ్చు. సికింద్రాబాద్‌, కాజీపేట, ఖమ్మం, విజయవాడ , ఏలూరు , రాజమండ్రి , సామర్లకోట, పెందుర్తి, విజయనగరం రైల్వే స్టేషన్లలో ఈ ట్రైన్ ఎక్కవచ్చు. 8 రాత్రులు, 9 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. పైగా దీని ధర రూ.15 వేలు మాత్రమే. ఈ ట్రైన్ మొదటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది. మొదటి రోజు పర్యాటకులు ట్రైన్ ని కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఎక్కవచ్చు.

రెండో రోజు పెందుర్తి, విజయనగరం రైల్వే స్టేషన్లలో పర్యాటకులు ట్రైన్ ఎక్కొచ్చు. టూరిస్ట్ రైలు మాల్తీపాత్‌పూర్ ని రెండవ రోజు రీచ్ అవుతారు. అక్కడ నుండి పూరీ బయల్దేరాలి. పూరీలో జగన్నాథ ఆలయాన్ని చూడవచ్చు. రాత్రికి పూరీలో స్టే చేయాలి.మూడో రోజు పర్యాటకులు కోణార్క్ వెళ్ళాలి. కోణార్క్‌లో సూర్యదేవాలయాన్ని చూడొచ్చు. గయ బయల్దేరాలి. నాలుగో రోజు గయ రీచ్ అవుతారు. తర్వాత కాశీకి బయల్దేరాలి. ఐదో రోజు కాశీ రీచ్ అవుతారు. కాశీలో విశ్వనాథ ఆలయం, వారణాసి కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవి టెంపుల్ ఇవన్నీ చూడవచ్చు.

సాయంత్రం గంగా హారతి ఉంటుంది. రాత్రికి వారణాసిలో ఉండాలి. ఆరవ రోజు అయోధ్య బయల్దేరాలి. రామజన్మభూమి, హనుమాన్‌గఢి చూడొచ్చు. ఆ తర్వాత ప్రయాగ్‌రాజ్ బయల్దేరాలి. ఏడో రోజు ప్రయాగ్‌రాజ్. త్రివేణి సంగమం కూడా చూడవచ్చు. హనుమాన్ మందిర్, శంకర్ విమాన్ మండపం ని కూడా చూడొచ్చు. ఎనిమిదో రోజు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు విజయనగరం, పెందుర్తి, సామర్లకోటకు రీచ్ అవుతారు. తొమ్మిదో రోజు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, కాజీపేట్, సికింద్రాబాద్ చేరుకోవడం తో ఈ టూర్ పూర్తి అయిపోతుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news