సోమాలియాలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. రాధాని మొదగిషుకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిస్మయో నగరంలోని ఓ హోటల్‌పై ఆత్మాహుతిదాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు.
పేలుడు పదార్థాలతో నింపిన కారుతో తవక్కల్ హోటల్ గేటును ఢీకొట్టి ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. అనంతరం హోటళ్లోకి ప్రవేశించిన సాయుధులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది దుర్మరణం చెందగా.. 47 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు భద్రతా సిబ్బంది, విద్యార్థులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఉగ్రవాదులు దాడిచేసిన హోటల్ సమీపంలో ఓ పాఠశాల ఉందని, పేలుళ్ల నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు గాయపడ్డారని సెక్యూరిటీ మినిస్టర్ యూసుఫ్ హుస్సేన్ ధుమాల్ వెల్లడించారు. భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని, ఆత్మాహుతి దాడిలో మరో ఉగ్రవాది చనిపోయాడని చెప్పారు. ఈ దాడిని తామే చేశామని అల్-షబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అల్‌ఖైదాతో సన్నిహిత సబంధాలున్న అల్-షబాబ్ సోమాలియాలో తరచూ విధ్వంసానికి పాల్పడుతోంది.