రైతులకు అధిక రుణాలివ్వాలి.. బ్యాంకర్లకు మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలు

-

తెలంగాణ రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శుభవార్త చెప్పారు. రైతులకు అధిక రుణాలివ్వాలని బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశాయి. అధిక రుణాలిచ్చి కర్షకులను ప్రోత్సహించాలని సూచించారు. ఇవాల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనతి కాలంలోనే తెలంగాణ దేశ వ్యవసాయరంగంలో అగ్రగామిగా ఎదిగిందని అన్నారు.

వ్యవసాయరంగంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో పంట ఉత్పత్తులు భారీగా పెరిగాయని, అందుకు తగ్గట్లుగా ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు విరివిగా రుణాలివ్వాలని బ్యాంకర్లను కోరారు. రాష్ట్రంలో పంటల మార్పిడికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహిస్తుందని తెలిపారు. బ్యాంకర్లు ఆయిల్‌ ఫామ్‌ సాగు కోసం రైతులకు రుణాలు అందించాలని సూచించారు.

డెయిరీ రంగం బలోపేతం చేసేందుకు అధ్యయనం చేసి ప్రణాళికాబద్ధంగా సహకరించాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బ్యాంకులు కేవలం పట్టణాలలోని ఆస్తులు, భూములనే ప్రామాణికంగా తీసుకుంటున్నాయని తెలిపారు. ఈ విధానాన్ని మార్చుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version