తెలంగాణ అప్పు 3.12 లక్షల కోట్లు..ఏపీ అప్పులు ఎంతంటే

-

తెలంగాణకు 2022 నాటికి రూ. 3,12,191 కోట్ల అప్పులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి లోక్‌ సభ లో అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్‌.. రాష్ట్రాల వారీగా అప్పుల వివరాలను లిఖిత పూర్వకంగా వెల్లడించారు.

నిర్మలా సీతారామన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2022 లో తెలంగాణ ప్రభుత్వ మొత్తం అప్పు రూ.3,12,191 కోట్లు.2020 లో రాష్ట్ర అప్పులు రూ. 225418 కోట్లు ఉండగా రెండేళ్లలోనే సుమార్‌ రూ.87 వేల కోట్లు పెరగడం గమనార్హం. అటు 2020లో ఏపీ అప్పులు రూ.307671 కోట్లు ఉండగా.. ప్రస్తుతం సంవత్సరానికి రూ.398903 కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news