కేరళలో పెరుగుతున్న టమోటో ఫీవర్‌ కేసులు.. పిల్లలేకే ప్రమాదం ఎక్కువ..

-

ఇప్పటికే కొవిడ్‌ వల్ల సగం దెబ్బతిన్నాం..ఇప్పుడు మంకీపాస్‌ కలవపెరుడుతుంది. దీని గోల ఎంట్రా బాబు అనుకుంటుంటే మధ్యలో ఇంకా చాలా వైరస్‌ పేర్లు వినిపిస్తున్నాయి. అసలేంటో ఇదంతా వైరస్‌ల కాలంలా ఉంది. ఒకటి తర్వాత ఒకటి సీక్వెన్స్‌లా వస్తున్నాయి. హైలెట్‌ ఏంటంటే.. ఇండియాలో కొత్త వైరస్‌లు అన్నీ ముందు కేరళలోనే ఎంట్రీ ఇస్తాయి. ఇప్పుడు కొత్తగా ఈ టమోటా ఫీవర్‌. దీని పేరే భలే వెరైటీగా ఉంది. ఈ కేసులు కేరళ రాష్ట్రంలో అత్యధికంగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు కేరళలో 80 కి పైగా టామోటో వైరల్ ఫీవర్ వ్యాధి కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆందోళన వద్దంటూనే..పెరిగే కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని అధికారులు అంటున్నారు. ఈ ఫీవర్‌ సంక్రమణను నివారించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు పాటిస్తే మేలని నిపుణులు అంటున్నారు.
పిల్లలే టార్గెట్‌..
టొమాటో ఫీవర్ లేదా టొమాటో ఫ్లూ కేసులు ఎక్కువగా పిల్లల్లోనే నమోదవుతున్నాయి. ఈ వైరల్ వ్యాధి సోకిన వ్యక్తి చర్మంపై దద్దుర్లు, నిర్జలీకరణం, చర్మంపై అసౌకర్యం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇతర ఫ్లూ మాదిరిగానే టమోటా జ్వరం కూడా ఒక అంటువ్యాధి. టొమాటో జ్వరం సోకిన వ్యక్తిని ఒంటరిగా ఉంచాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఎందుకంటే వ్యాధి వేగంగా వ్యాపిస్తుందట… టొమాటో ఫ్లూ వ్యాప్తిని నిరోధించడంలో విశ్రాంతి, సరైన పరిశుభ్రత ముఖ్యం.
టొమాటో ఫ్లూ అంత ప్రాణాంతక వ్యాధి కాదు. అనుభవించిన చాలా లక్షణాలు తేలికపాటివి, వైరల్ వ్యాధి కారణంగా ఆసుపత్రిలో చేరిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. టొమాటో జ్వరం నుంచి పిల్లలను సురక్షితంగా ఉంచడానికి ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి..! చర్మంపై బొబ్బలు లేదా దద్దుర్లపై రుద్దడం మానుకోండి. ఇంట్లో సరైన పరిశుభ్రత ఉండేలా చేసుకోండి. పిల్లవాడు తరచుగా స్నానాలు చేస్తున్నాడని నిర్ధారించుకోండి. చల్లటి నీటితో స్నానం చేయడం మంచిది. టొమాటో ఫీవర్ ప్రాణాంతకం కానప్పటికీ ఇది జ్వరం, ఇతర ఫ్లూ-వంటి లక్షణాలను కలిగిస్తుంది.ఇంకా రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. ఎవరికైనా వైరస్ సోకితే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news