నేచురల్ స్టార్ నాని నటించిన ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నిత్య మీనన్. అందంతో కుర్రకారులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తన టాలెంట్‌తో అవకాశాలను అందుకుంది. కొన్ని చిత్రాలలో పాటలు పాడి కూడా తన టాలెంట్‌ని చూపించింది నిత్యామీనన్. తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళం వంటి చిత్రాలలో కూడా నటించి మెప్పించింది. ఇలా వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇక చాలారోజులు గ్యాప్ తీసుకున్నాక ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.
తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ చెప్పిన ఒక మాట ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. నిత్య మాట్లాడుతూ .. “తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి నన్ను అందరూ కూడా ఎంతో గౌరవంగా చూసుకున్నారు. నాకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. కానీ ఒక తమిళ హీరో మాత్రం పదే పదే నన్ను అసభ్యంగా తాకుతూ ఇబ్బందిపెట్టేవాడు. అతని చేష్టల కారణంగా ఆ సినిమాను పూర్తిచేయడం కష్టమైపోయింది” అని చెప్పుకొచ్చింది.