హీరోయిన్ రేంజ్ లో అలరిస్తున్న నితిన్ భార్య.. ఫొటోస్ వైరల్..!

-

ఇటీవల కాలంలో హీరోయిన్లు మాత్రమే కాదు స్టార్ హీరోల భార్యలు కూడా అందం విషయంలో చాలా పోటీ పడుతున్నారని చెప్పాలి. ముఖ్యంగా హీరోయిన్స్ గ్లామర్ విషయంలో ఎలా అయితే జాగ్రత్త తీసుకుంటారో అంతకుమించి జాగ్రత్తలు తీసుకుంటూ కరెక్ట్ ఫిజిక్స్ మెయింటైన్ చేస్తున్నారు. మన స్టార్ హీరోల భార్యలు కూడా ఈ క్రమంలోనే స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి గ్లామర్ లుక్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ప్రతిరోజు రకరకాల దుస్తులతో యువతను బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఫ్యాషన్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు స్నేహారెడ్డి రోజురోజుకు రకరకాల ట్రెండీ వేర్ తో మరింతగా పాపులారిటీని సంపాదించుకుంది.

ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక హీరో భార్య కూడా పోటీకి దిగిందని చెప్పవచ్చు. ఆమె ఎవరో కాదు షాలిని.. హీరో నితిన్ కు 2020లో వివాహం జరిగిన విషయం తెలిసిందే. షాలిని కందుకూరి అనే అమ్మాయిని జూలై 26 2020 న వివాహం చేసుకున్నాడు.

ఫలక్నుమా ప్యాలెస్ లో అతి కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. లాక్ డౌన్ నిబంధనలు ఉండడంతో డెస్టినేషన్ వెడ్డింగ్ గా అనుకున్న నితిన్ పెళ్లి చాలా సింపుల్గా అయిపోయింది. పెళ్లి చేసుకున్న తర్వాత నితిన్ తన భార్యతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తన భార్యను అందరికీ పరిచయం చేశాడు.

ఒకపక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరొక పక్క ఫ్యామిలీ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు నితిన్. ఇదిలా ఉండగా ఈయన భార్య షాలిని కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా వుంటుంది. ఈమెకి ఇన్ స్టా లో లక్ష మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

శాలిని తన ఫ్రెండ్ ఫ్యాషన్స్ స్టూడియోకి తన కాస్ట్యూమ్స్ ను ప్రమోట్ చేస్తూ ఒక ఫోటో షూట్ లో పాల్గొనింది. ఈమె ధరించిన కాస్టెన్సీ లైట్ బ్లూ కలర్ లో ఉన్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం చాలా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి నేటిజన్స్ కూడా ఈమెపై పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news