పిల్లలకి బాధ్యత నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత. తల్లిదండ్రులే పిల్లలు సక్రమంగా ఉన్నారా లేదా బాధ్యత ఉంటున్నారా లేదా అనేది చూడాలి. నిజానికి చిన్న పిల్లలకి బాధ్యత నేర్పడం కాస్త కష్టమే. అయినప్పటికీ బాధ్యతని అలవాటు చేయాలి. లేకపోతే అది తల్లిదండ్రులు తప్పే. చాలా మంది పిల్లలు అలా చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల మాటల్ని కూడా లెక్క చేయరు అలా కాకుండా మంచిగా బాధ్యతగా ఉండాలంటే ఇలా చేయండి. అప్పుడు కచ్చితంగా పిల్లలు బాధ్యతగా ఉంటారు.
నవ్వుతూ మాట్లాడండి పిల్లలని వెక్కిరించద్దు:
పిల్లలతో నవ్వుతూ ఉంటే పిల్లలు కూడా బాగా ఉంటారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే పిల్లలు ప్రవర్తన పెద్దల ప్రవర్తన మీద ఆధారపడి ఉంది పెద్దలు సరిగ్గా ప్రవర్తిస్తే పిల్లలు కూడా మంచిగా ప్రవర్తిస్తూ ఉంటారు.
మీ పిల్లలు వినేలా చేయండి:
మీ పిల్లలు వినేలా చేస్తే వారు కూడా బాధ్యతగా ఉంటారు అలానే వాళ్ళని ఆలోచించే విధంగా మీరు మార్చాలి. వారు విన్నా వారు ఆలోచించిన వారు చాలా విషయాలను నేర్చుకోవడానికి అవుతుంది.
బాధ్యతను నేర్పండి:
వారి పనులు వారు చేసుకోవడం చిన్న చిన్న పనులు చేసుకోవడం వంటివి వాళ్ళకి అలవాటు చేయండి అప్పుడు వాళ్ళు బాధ్యతగా ఉంటారు.
ఆలోచించే విధంగా మాట్లాడండి:
పిల్లలు ఆలోచించే విధంగా మాట్లాడండి అంతేకానీ తిట్టడం వంటివి చేయొద్దు.