లాక్డౌన్ లేని ఒకే ఒక్క రాష్ట్రంగా తెలంగాణ..

కరోనా సెకండ్ వేవ్ ఎంతలా విజృంభిస్తుందో మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పనిలేదు. మొదటి వేవ్ తో పోల్చితే తీవ్రంగా ఉండడంతో చాలా రాష్ట్రాలు లాక్డౌన్ పెట్టుకున్నాయి. ఢిల్లీలో మే 10వ తేదీ వరకు లాక్డౌన్ ఉంది. ఏప్రిల్ 29న మొదలైన ఇంకా కొనసాగుతూనే ఉంది. కోవిడ్ ను తట్టుకోవడానికి మహారాష్ట్ర కూడా మే 15వ తేదీ వరకు తాళం వేసేసింది. ఇంకా చాలా రాష్ట్రాలు కర్ణాటక, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, హర్యానా, బీహార్, ఒడిషా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు పూర్తి లాక్డౌన్ విధించాయి.

ఇక ఆంధ్రప్రదేశ్ లో మధ్యాహ్నం 12గంటల నుండి కర్ఫ్యూ విధించబడింది. గుజరాత్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో పాక్షిక లాక్డౌలు విధించారు. ఇక తెలంగాణలో కేవలం నైట్ కర్ఫ్యూ మాత్రమే అమలులో ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టే అవకాశం లేదని, దానివల్ల ఆర్థికంగా మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వెల్లడి చేసారు.