చంద్రబాబుకు ఆ ఆప్షన్ కూడా లేకుండా చేశావా శంకరా!!

-

ఆంధ్రప్రదేశ్ రసవత్తర రాజకీయ పోరు సాగుతుంది. టీడీపీ, అధికార వైసీపీ నేతల మథ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే ఈఎస్‌ఐ పరికరాల కొనుగోలు కుంభకోణంలో అవినీతి ఆరోపణల కేసులో జైలులో ఉన్న మాజీమంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు రాసిన లేఖతో బీసీలకు ఎలాంటి సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ… బీసీ నేతలు ఏవైనా కేసుల్లో ఇరుక్కుంటే అవి స్వయంకృతాపరాధాలు తప్ప.. బీసీ హక్కులు, ప్రయోజనాల రక్షణ కోసం చేసే త్యాగాలుగా బీసీలు భావించవద్దని స్పష్టం చేశారు.


అదేవిధంగా హత్యానేరంపై జైలుకెళ్లిన మాజీమంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర విషయంలో కూడా బీసీలకు సంబంధం లేదని తెలిపారు. దీంతో ఉన్న ఒక్క ఆఫ్షన్ లేకుండా పోయిందని చంద్రబాబు విస్మయానికి గురయ్యారు. ఇప్పటివరకు ఏ కులం వారు తప్పు చేసి… అరెస్ట్ అయినా.. ఆకులాన్ని వైసీపీ ప్రభుత్వం వేధిస్తోంది అంటూ టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఏకంగా ఆ కులానికి చెందిన అధ్యక్షుడే చంద్రబాబుకు ఝలక్ ఇచ్చినట్లైంది.

అంతేకాకుండా ఇక నుంచీ బాబు అలెర్ట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేమంటే.. ఇక ముందు మరే కులానికి చెందిన నాయకుడిని అయినా.. తప్పు చేసినప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తే “ప్రభుత్వం ఆ కులాన్ని వేధిస్తోంది” అంటూ బాబు అనలేని పరిస్థితి ఇప్పుడు ఎదురైంది. ఎందుకంటే ఇకనుంచీ ఏ కులానికి ఆ కులం అధ్యక్షులు అలా ముందు ముందు కూడా బాబుకి ఝలక్ ఇచ్చే ప్రమాదం లేకపోలేదు.

ఇలా ప్రతీ విషయానికీ కులం కార్డు వాడటం మొదలుపెడితే… చంద్రబాబు ఒక్కో కులాన్ని ఎన్నికల నాటికి దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది! చివరికి వారి సొంత కులాన్ని కూడా దూరం చేసుకుంటే పడే నాలుగు ఓట్లు కూడా పడవనే భయం చంద్రబాబును తీవ్రంగా వేధించే అవకాశాలున్నాయని పలువురు ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news