ఈరోజుల్లో ప్రతి అకౌంట్‌కు పాస్‌వర్డ్ పెట్టుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఆ పాస్‌వర్డ్‌లను హ్యాకర్లు హ్యాక్ చేయడం కూడా చాలా సాధారణ విషయం అయిపోయింది. ఎంత స్ట్రాంగ్ పాస్‌వర్డ్ పెట్టుకున్నా..హ్యాకర్లు తెలుసుకుంటున్నారు.. పోనీ పాస్‌వర్డ్ లేకుండా ఉంటే..అది ఇంకా ప్రమాదమాయే..పాస్‌వర్డ్ పెట్టుకున్నా.. సూపర్ స్ట్రాంగ్‌గా..హ్యాకర్లు హ్యాక్ చేయలేకుండా ఉంటే.. అంతకుమించి ఇంకేం కావాలి..సరిగ్గా ఇలాంటి టెక్నాలజీనే ఆపిల్ తీసుకొస్తుంది.
ఇకపై తమ ఫోన్లు, కంప్యూటర్లు పాస్ వర్డ్‌తో కాకుండా పాస్ కీలతో లాగిన్ అయ్యే టెక్నాలజీని ఆపిల్ రూపొందిస్తుంది. హ్యాకర్-బస్టింగ్ ప్లాట్ పేరుతో దీన్ని త్వరలో ప్రారంభించబోతుంది. పాస్‌వర్డ్స్ అనేవి వినియోగదారుల డేటాకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించలేవు. పాస్‌వర్డ్స్ వైఫల్యాల గురించి సైబర్ సెక్యూరిటీ నిపుణులు సంవత్సరాలుగా హెచ్చరిస్తూనే ఉన్నారు. సాధారణ పాస్ వర్డ్‌లను సులభంగా ట్రాక్ చేయొచ్చు..ఎంత స్ట్రాంగ్ పాస్‌వర్డ్ అయినా హ్యాకర్స్ కనిపెట్టేస్తున్నారు. అయితే ఆపిల్ మునుపెన్నడూ లేని సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తేబోతున్నది. Apple iPhone కోసం iOS 16లో పాస్ వర్డ్ లేని లాగిన్‌లను, Mac కోసం MacOS వెంచురాను పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
బ్రేక్ చేయడానికి ఛాన్సే లేదు…
సెప్టెంబరులో ఈ టెక్నాలజీని కంపెనీ ఇంఫ్లిమెంట్ చేయబోతున్నది. పాస్ వర్డ్‌కు బదులుగా పాస్‌కీలను ఉపయోగించి వినియోగదారులు లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినది డిజిటల్ కీ ఉపయోగించి లాగిన్ అవుతారు. మీరు iPhone లేదంటే Macలో మీ వేలిముద్ర (టచ్ ID) లేదంటే ముఖం (Face ID) చూపించి ధృవీకరించాల్సి ఉంటుంది. ఇది అత్యంత త్వరగా లాగ్ ఇన్ చేస్తుంది. మీరు ఊహించలేని, బ్రేక్ చేయలేని లాగిన్‌ని కలిగి ఉంటారు. పాస్ కీ ప్రమాదకరమైన హ్యాక్ దాడుల నుంచి మిమ్మల్ని రక్షించగలుగుతుందని వెల్లడించింది. అంతేకాదు.. ఒక్కో సర్వీసుకు ఒక్కో పాస్ కీ పెట్టుకునే అవకాశం ఉందని ఆపిల్ తెలిపింది
మీ పాస్‌కీలు మీ ఫోన్ లేదంటే మాక్‌లో ఉంచుతారు. Apple iCloud కీచైన్‌ని ఉపయోగించి మల్టీఫుల్ గాడ్జెట్‌లలో సింక్ అవుతాయి. దీని ద్వారా పాస్‌వర్డ్‌లను ట్రాక్ చేయవచ్చు. కానీ ఇప్పటికీ పాస్ కీలను యాపిల్ సహా ఎవరూ చదవలేరు. అంతేకాదు.. ఫిషింగ్ ద్వారా పాస్‌వర్డ్‌ను ట్రాక్ చేయలేరు. Windows ల్యాప్ టాప్‌లు, Android ఫోన్‌లతో సహా Apple-యేతర పరికరాలలో కూడా పాస్‌కీలతో లాగిన్ అయ్యేలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్ రెండు సంవత్సరాలుగా పాస్‌వర్డ్ లేని సిస్టమ్‌లను అభివృద్ధి చేస్తున్నాయి.
-Triveni Buskarowthu