రాజధాని వికేంద్రీకరణతో పాటు చంద్రబాబు సీఎం జగన్‌కు చేసిన సవాల్… 48 గంటల డెడ్‌లైన్ అంశం విపక్ష టీడీపీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే టీడీపీలో చంద్రబాబు అన్నా.. ఆయన తనయుడు లోకేష్ అన్నా.. వీళ్ల మాటలు అన్నా పట్టించుకునే వారు లేరు. వీరి మాటలను కొందరు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు చాలా లైట్ తీస్కొంటున్నారు. మరి కొందరు పార్టీ తరపున ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా పట్టించుకోని పరిస్థితి ఉంది. తాజాగా చంద్రబాబు రాజధాని కోసం రాజీనామాల అంశాన్ని ప్రస్తావనకు తెచ్చినప్పుడు టీడీపీలో ఇప్పుడు ఆయనకు మిగిలిన ఉన్న 19 మంది ఎమ్మెల్యేల్లో నలుగురైదుగురు ఎమ్మెల్యేలు మినహా ఎవ్వరూ పట్టించుకోలేదట.
ఇక ఇప్పుడు చంద్రబాబు కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నుంచి టీడీపీ ఎమ్మెల్సీలకు ఫోన్లు వెళ్లాయట. అయితే అటు వైపు నుంచి ఎవ్వరూ స్పందించడం లేదని.. పార్టీకి ఉన్న ఎమ్మెల్సీలలో 90 మంది ఎమ్మెల్సీలు వీళ్ల ఫోన్లు ఎత్తకపోవడం లేదా స్విచ్చాఫ్‌లు చేసుకుని ఉన్నారట. చంద్రబాబు రాజీనామాల అంశాన్ని ప్రస్తావనకు తేవడంతో అటు ఎమ్మెల్యేలే కాదు.. ఇటు ఎమ్మెల్సీలు కూడా ఈ అంశంపై విముఖత చూపుతున్నారని.. అందుకే వీరు స్విచ్ఛాఫ్ చేసుకున్నారని పార్టీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి.. ప్రజల్లో అమరావతి సెంటిమెంట్ అనేది ఎంత మాత్రం లేదని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా విశ్వసిస్తున్నారు. ఇప్పుడు ప్రజలు కరోనా దెబ్బతో ఆర్థికంగా కుదులైపోయారు. అసలు ఎన్నికలు.. పార్టీలు.. రాజకీయం.. అమరావతి అనే అంశాల గురించి పట్టించుకునే తీరిక కూడా లేదు. ఈ విషయంలో టీడీపీ ప్రజాప్రతినిధులు ఆలోచిస్తోంది కూడా నిజం. అయితే అవన్నీ పట్టని చంద్రబాబు వీటినే పట్టుకుని రాజకీయ రగడకు తెరలేపాలని చూస్తుండడం వారికే నచ్చడం లేదు.
అందుకే చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ఫోన్లు చేసినా అటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలా చాలా లైట్ తీస్కొంటున్నారని అర్థమవుతోంది. ఒకరిద్దరు ఎమ్మెల్సీలు అయితే తాము రాజీనామాలు చేయం.. కావాలంటే మీరు చేసుకోండని లోకేష్‌కు తెగేసి చెప్పారట.