రూ.7,777కే లావా కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్

-

దేశీయ మొబైల్స్ త‌యారీదారు లావా బ‌డ్జెట్ ధ‌ర‌కే ఓ నూత‌న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. లావా జ‌డ్‌66 పేరిట ఈ ఫోన్ మార్కెట్‌లో విడుద‌లైంది. మెరీన్ బ్లూ, బెర్రీ రెడ్‌, మిడ్‌నైట్ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో దీన్ని విడుద‌ల చేశారు. ఈ ఫోన్‌ను అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల‌లో విక్ర‌యిస్తారు.

Lava Z66 smart phone launched in india

లావా జ‌డ్‌66 ఫోన్ ధ‌ర‌ను రూ.7,777గా నిర్ణ‌యించారు. ఇందులో 6.08 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లే ఉంది. 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. దీనికి 3జీబీ ర్యామ్ స‌పోర్ట్ ఉంది. 32జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. 128జీబీ వ‌ర‌కు ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్ ను అందిస్తున్నారు. ఇందులో 3950 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఏర్పాటు చేశారు.

లావా జ‌డ్‌66 ఫోన్‌లో డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఆండ్రాయిడ్ 10, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఫేస్ అన్‌లాక్, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 13, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు త‌దిత‌ర ఇత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news