తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు షాక్..10వ తేదీ దాటినా అందని జీతాలు !

-

ఏపీ ఉద్యోగస్థుల గతే.. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగస్థులకు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో లాగే… ఇప్పుడు తెలంగాణలోనూ ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు ఆలస్యం అవుతున్నాయి. ఉగాది పండుగ దృష్ట్యా ఒకటో తేదీన జీతాలు జమ అవుతాయని భావించిన ఉద్యోగులకు షాక్‌ తగిలింది.

వారం రోజులు గడిచినా.. ఇంకా జీతాలు అందలేదు. శని, ఆదివారం వరుస సెలవులు రావడంతో.. శ్రీరామ నవమి తర్వాతే జీతాలు అకౌంట్లలో పడే పరిస్థితి ఉండటంతో… వారిలో ఆందోళన నెలకొంది. ఉగాది పండుగను సంబంరంగా జరుపుకుందామని భావించిన ఉద్యోగులకు జీతాలు అందక.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎప్పుడు జీతాలు పడతాయోనని.. సెలఫోన్లలో ఎస్‌ఎంఎస్‌ లు చూసుకుంటున్నారు. అయితే.. ఆర్బీఐ నుంచి తీసుకున్నఅప్పు వచ్చిన తర్వాతనే జీతాలు చెల్లిస్తామని ఆర్థిక శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రాసెస్‌ కు ఇంకో 5 రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల్లో..  తీవ్ర ఆందోళన మొదలైందిద.

Read more RELATED
Recommended to you

Latest news