నోకియా ఫ్లిప్ ఫోన్ వచ్చేస్తోంది.. ధర రూ.5వేలలోపే..!

-

ఒకప్పుడు ఓ రేంజ్‌లో సేల్స్ జరిగిన ఫోల్డెడ్ ఫోన్లు ఇప్పుడు మళ్లీ ట్రెండ్‌లోకి వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్‌లో మడత ఫోన్ల ట్రెండ్ సాగుతోంది. ఇప్పటికే శాంసంగ్, మోటోరోలా కంపెనీలు ఫోల్డింగ్‌, ఫ్లిప్‌ మోడల్స్‌ను విడుదల చేశాయి. షావోమి, గూగుల్, ఒప్పో కంపెనీలు కూడా ఫోల్డింగ్ ఫోన్లను త్వరలో మార్కెట్‌లోకి తీసుకురావడంలో బిజీ అయ్యాయి. ఈ క్రమంలోనే నోకియా కంపెనీ మరో క్లాసిక్ మోడల్ ఫోన్‌ను ఇవాళ విడుదల చేయడానికి రెడీ అయింది.

నోకియా 2660 ఫ్లిప్‌ పేరుతో ఫోల్డింగ్‌ ఫీచర్‌ ఫోన్‌ను తీసుకొస్తుంది. ఈ ఫోన్‌ ధర ₹ 5 వేల లోపు ఉంటుందని సమాచారం. చాలా రోజుల తర్వాత నోకియా నుంచి వస్తోన్నఈ ఫ్లిప్‌ ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

నోకియా 2660 ఫ్లిప్‌ కాయ్‌ ఓఎస్‌తో పనిచేస్తుంది. ఫోన్‌లో రెండు డిస్‌ప్లేలు ఉంటాయి. ఫోన్‌ తెరిచినప్పుడు పై భాగంలో 2.8 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే, కింద కీబోర్డ్‌ ఇస్తున్నారు. ఫోన్‌ మూసినప్పుడు ముందు భాగంలో 1.77 అంగుళాల క్యూక్యూబీజీఏ స్క్రీన్‌, ఫ్లాష్‌ లైట్‌తో 0.3 ఎంపీ కెమెరా ఉన్నాయి. 4జీకి సపోర్ట్‌ చేస్తుంది. యూనిసాక్‌ టీ107 ప్రాసెసర్‌ను ఉపయోగించారు.

1,450 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 2.75 వాట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. సింగిల్‌ ఛార్జ్‌తో సుమారు ఏడు గంటలు నిరంతరాయంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. ఎఫ్‌ఎం రేడియో, ఎంపీ3 ప్లేయర్‌ ఫీచర్లున్నాయి. 48 ఎంబీ ర్యామ్‌/ 128 ఎంబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ను తీసుకొస్తున్నారు. 32 జీబీ మెమొరీ కార్డును సపోర్ట్ చేస్తుంది. బ్లూ, రెడ్‌, బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news