భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 10గంటల పాటు భారత్ బంద్ నిర్వహించాలని భారతీయ కిసాన్ మోర్చా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈరోజు సాయంత్రం 4గంటల వరకు అన్నీ మూసి ఉండనున్నాయి. ఐతే ఈ భారత్ బంద్ అహింసాపూరితమనీ, మేమేమీ మూసివేయడం లేదని, అంబులెన్సులు, వైద్య సిబ్బందికి దారులు తెరిచే ఉంటాయని, అత్యవసరాలకు ఎలాంటి ఆటంకం కలగనివ్వమని భారతీయ కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాకేష్ టికాయత్ పేర్కొన్నారు.
మేము కేవలం సందేశం పంపానుకుంటున్నామని, కేంద్ర ప్రభుత్వానికి ఆ సందేశం అర్థం అవుతుందని ఆశిస్తున్నామని రాకేష్ టికాయత్ పేర్కొన్నారు. ఇంకా చిన్న చిన్న దుకాణాల వారిని మూసివేయాలని కోరుతున్నామని, సాయంత్రం 4గంటల తర్వాత అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చని అన్నారు. భారత్ బంద్ సందర్భంగా హర్యానా, ఢిల్లీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో భద్రత కారణంగా పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి.