ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నాంపెల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు షాక్ ఇచ్చింది. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ ను నాంపెల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు జారీ చేసింది. ఓ కేసు విషయంలో ఎమ్మెల్యే లు రసమయి బాలకిషన్, నన్నపనేని నరేందర్ విచారణకు హాజరుకాలేదు. దీనిపై నాంపెల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఎమ్మెల్యే లు రసమయి బాలకిషన్, నన్నపనేని నరేందర్ లకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని నాంపెల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు ఆదేశాలును జారీ చేసింది.
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రస్తతం రాష్ట్ర సాంస్క్రతిక శాఖ చైర్మెన్ గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు కేబినెట్ హోదా కూడా ఉంది. అలాగే ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ 2018 వరకు వరంగల్ మహానగర పాలక సంస్థకు మేయర్ గా ఉండే వారు. 2018 లో వరంగల్ తూర్పు నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగ వీరు ఒక కేసు విషయంలో కోర్టుకు హాజరు కాకపోవడంతో.. నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది.