చాలా మంది మహిళలు రెగ్యులర్ గా పీరియడ్స్ రాక ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు కూడా రెగ్యులర్ గా పీరియడ్స్ రాక ఇబ్బంది పడుతున్నారా..? అయితే కచ్చితంగా మీరు దీన్ని చూడాలి. అయితే పీరియడ్స్ రాకపోవడం అనేది సమస్య. ఈ సమస్య నుండి దూరంగా ఉండాలంటే వీటిని తీసుకుంటూ ఉండండి. ఇవి పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి సహాయపడతాయి.
పైనాపిల్:
పైనాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది పైనాపిల్ లో ఉండే బ్రోమాలిన్ గర్భాశయం దెబ్బతినకుండా చూస్తుంది అలాగే రుతుస్రావం సరైన సమయంలో వచ్చేందుకు కూడా సహాయపడుతుంది.
అలోవెరా:
అలోవెరా కూడా ఆరోగ్యానికి మంచిదే. పీరియడ్స్ రావడానికి సహాయపడుతుంది పైగా అలోవెరాను తీసుకోవడం వలన జీవ క్రియలు సరిగా పనిచేస్తాయి. హార్మోన్ లోపం పీరియడ్స్ సమస్యలను కూడా ఇది పరిష్కరిస్తుంది.
బొప్పాయి:
బొప్పాయి పండు ఆరోగ్యానికి మంచిది గర్భాశయం లైనింగ్ దెబ్బ తినకుండా ఇది చూస్తుంది అలానే పీరియడ్స్ సరిగ్గా టైం కి వచ్చేటట్టు కూడా చేస్తుంది.
అల్లం:
అల్లం గర్భాశయ రుతుస్రావ సమస్యలను పరిష్కరించుతుంది అల్లాన్ని ఆహారంలో తీసుకుంటే కూడా ఆరోగ్యనికి మంచిది. పైగా పీరియడ్స్ కూడా వస్తాయి.
బెల్లం:
పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి బెల్లం కూడా సహాయపడుతుంది ఇందులో చక్కటి గుణాలు ఉంటాయి. బెల్లం తీసుకోవడం వలన పీరియడ్స్ నొప్పి కూడా తగ్గుతుంది.
బీట్రూట్:
బీట్రూట్ పీరియడ్స్ సరిగ్గా సమయానికి వచ్చేటట్టు సహాయ పడుతుంది. కడుపు ఉబ్బరం నీటి నిల్వ వంటి ఇబ్బందులు కూడా రావు. బీట్రూట్ లో ఫాలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం కూడా ఉంటాయి.
పసుపు:
పీరియడ్స్ సమయానికి రాకపోతే పసుపుని కూడా తీసుకుంటూ ఉండండి వేడిపాలలో పసుపు వేసుకుని తీసుకుంటే కూడా చక్కటి ఫలితాలని మీరు పొందవచ్చు అలానే దాల్చిన చెక్క కూడా సహాయపడుతుంది ఇది కూడా పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి హెల్ప్ అవుతుంది.