రాజు ఎక్కడుంటే అదే రాజధాని కాదు : ఎంపీ రఘురామ

-

సీఎం జగన్ ఎక్కడుంటే అదే రాజధాని అవుతుందని వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. దీనికి స్పందించిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ.. సీఎం జగన్ దుకాణం సర్దేస్తున్నారనే ప్రచారాలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. రాజు ఎక్కడుంటే అదే రాజధాని కాదని రఘురామ వ్యాఖ్యానించారు. త్వరలోనే తాను విశాఖ షిఫ్ట్ అవుతున్నానంటూ ఢిల్లీలో సీఎం జగన్ ప్రకటించగా, సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అవుతుందని వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు.

MP Raghurama Krishnam Raju complains to police against YSRCP MLAs

జగనన్న విశాఖ వాసంపై రాష్ట్రమంతా చర్చ నడుస్తోందని అన్నారు. సీఎం మాట్లాడిన రెండ్రోజులకే ఆయన తమ్ముడిని సీబీఐ ప్రశ్నించిందని అన్నారు. వివేకా హత్య కేసు నుంచి దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారని రఘురామ పేర్కొన్నారు. ఇక, కోర్టు తీర్పు వచ్చే వరకు రాజధానిలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. మీకు అంతగా నచ్చితే విశాఖకు వీకెండ్ వెళ్లండి అంటూ జగన్ కు సలహా ఇచ్చారు. కాగా, రేపో మాపో మరికొందరికి సీబీఐ నోటీసులు అందే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news