గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఈ నెల 9వ తేదీన ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది . ఓఎంఆర్ విధానంలో రాత పరీక్ష నిర్వహించనున్నారు టీఎస్‌పీఎస్సీ అధికారులు.ఈ క్రమంలో గ్రూప్ 1 హాల్ టికెట్లు కూడా కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
అయితే హాల్ టికెట్‌పై లేటెస్ట్ పాస్ ఫొటో తప్పనిసరిగా అతించుకోని వెళ్లాలి. అంటే 3 నెలల క్రితం నుంచి నేటి వరకు దిగిన పాస్ ఫొటో తప్పనిసరి. హాల్ టికెట్‌పై అభ్యర్థి తన ఫొటో పేస్ట్ చేయకపోతే ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతించరు అని స్పష్టం చేసింది. ఈ నిబంధనను హాల్ టికెట్‌లో పొందుపరిచినట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు తెలిపారు. ఫొటో కింద సంతకం చేసేందుకు తప్పనిసరిగా స్పేస్ ఉంచుకోవాలని ,హాల్ టికెట్‌తో పాటు పాస్ పోర్ట్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు,పాన్ కార్డు, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఒరిజినల్ కార్డును పరీక్షా కేంద్రం వద్ద చూపిస్తేనే లోపలికి అనుమతిస్తారు. కాగా, 563 పోస్టుల కోసం దాదాపు 4.30 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా జూన్ 9 ప్రిలిమినరీ పరీక్ష , అక్టోబర్ 21న మెయిన్స్ పరీక్ష నిర్వహించునున్నారు.