తెలంగాణ విద్యాశాఖ ఇటీవల పదో తరగతి పరీక్షలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇందులో 90 శాతం విద్యా్ర్థులు ఉత్తీర్ణులయ్యారు. అయితే ఉత్తీర్ణులైన విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. మోడల్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ వెలువడింది.
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ విద్యలో భాగంగా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. అడ్మిషన్ల కోసం ఈ నెల 2వ తేదీ నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్ పాసైన విద్యార్థులు సంబంధిత వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.