నిరుద్యోగులకు శుభవార్త..ఏప్రిల్ మొదటి వారంలోనే పోలీసు శాఖ నుంచి నోటిఫికేషన్‌

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగాల భర్తీ పై కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఒకేసారి 90 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీ వేదిక గా ప్రకటన చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి తొలి ప్రకటన పోలీస్ శాఖ నుంచి వచ్చే అవకాశం ఉంది.

జోన్ల వారీగా ఉద్యోగాల ఖాళీల జాబితా లో ఇప్పటికే సిద్ధంగా ఉన్న అధికారులు ప్రభుత్వ ఆమోదం తెలిపిన వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు శాఖ మండలి కసరత్తు మొదలుపెట్టింది. ఈనెలాఖరుకు లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో ఉద్యోగ ప్రకటన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా పోలీసు శాఖలో దాదాపు 18 వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు నిర్ధారించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news