నేను తిరిగే కారుకు ఎన్టీఆర్, వైయస్సార్ రెండు ఫోటోలు పెట్టుకుని దమ్ముగా ధైర్యంగా తిరుగుతానని అన్నారు కొడాలి నాని.ఎన్టీఆర్ కుటుంబంతో తనకు ఉన్న బాంధవ్యం విడదీయరానిదని.. వారికోసం నేను.. నాకోసం వారు అనేక త్యాగాలు చేశారు అని తెలిపారు. గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొడాలి నాని ఎన్టీఆర్ అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ… ఎన్టీఆర్, వైఎస్సార్ తనకు రెండు కళ్ళు అని అన్నారు.
టీడీపీ గౌడ, యాదవ, మత్స్యకార, ఇతర బీసీ సామాజిక వర్గాలను విస్మరించిందని.. కనీసం వారికి సీట్లు కూడా కేటాయించని పరిస్థితి ఉందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి అనేక రాజ్యాంగ పదవులు ఇచ్చారు . అంతేగాka రాజ్యసభ స్థానాలు ఇస్తూ.. ఎమ్మెల్యే ఎంపీ సీట్లను సగం వారికే కేటాయించిందన్నారు. ప్రజలను నమ్ముకొని ధైర్యంగా ముందుకు వెళుతున్న ముఖ్యమంత్రి జగన్‌కు, తనకు అభిమానులు మద్దతుగా నిలవాలని కోరారు కొడాలి నాని.ఆత్మీయ సమావేశంలో పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.