సంఖ్యాశాస్త్రం జ్యోతిష్యంలోని ఒక భాగమే. జ్యోతిష్యం ద్వారా భవిష్యత్తులో ఏం జరగబోయేది ముందే అంచనా వేస్తారు. ఐతే ప్రస్తుతం మీ పుట్టిన తేదీలను తీసుకుని ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉందో ముందే తెలుసుకోవచ్చు. ఏయే తేదీల్లో పుట్టిన వారు ఎలాంటి వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందో? దేనిపట్ల జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
ఒకటి: ఏ నెలలో అయినా 1, 10, 19, 28వ తేదీల్లో సూర్యుడు అధికారంలో ఉంటాడు. అందువల్ల ఈ తేదీల్లో పుట్టిన వారు ఆరోగ్య పరంగా పెద్దగా ఇబ్బందులు పడరు. వీరికి ఆరోగ్య పరమైన ఇబ్బందులంటు వస్తే అది కూడా గుండెకి సంబంధించినవి వచ్చే అవకాశం ఎక్కువ. అది గాక, రక్త ప్రసరణ ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. డ్రై ఫ్రూట్స్, నారింజ, ఆపిల్ వంటివి ఎక్కువగా తినడం మంచిది.
రెండు: 2, 11,20, 29వ తేదీల్లో పుట్టినవారు కడుపు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడతారు. రక్తం ఎక్కువగా లేకపోవడం, ఒత్తిడి తట్టుకోక ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. మానసికంగా సున్నితంగా ఉంటారు కాబట్టి చిన్న విషయాలకు కూడా ఒత్తిడి తీసుకుని విపరీతంగా బాధపడతారు.
మూడు: 3, 12, 21, 30వ తేదీల్లో పుట్టినవారు ఛాతీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడతారు. చర్మ సమస్యలు, డయాబెటిస్ ఇంకా ఎక్కువగా అలసిపోవడం వంటి ఇబ్బందులు కలుగుతాయి.
నాలుగు: 4, 13, 22, 31వ తేదీల్లో పుట్టినవారు డిప్రెషన్, శ్వాస సంబంధ ఇబ్బందులు ఎదుర్కొంటారు. జలుబు, దగ్గు, గుండె సమస్యలు, కొన్నిసార్లు రోగం ఏందనేది కూడా తెలియదు.
ఐదు: 5,14, 23వ తేదీల్లో పుట్టినవారు ఒత్తిడి ఎక్కువ తీసుకోవడం వల్ల నిద్రలేమి, కాలేయ సమస్యలతో బాధపడతారు. వీరికి ధ్యానం చేయడం బాగా ఉపయోగపడుతుంది. ఒత్తిడి ఎక్కువ తీసుకోకపోతే బాగుంటుంది.
ఆరు: 6, 15, 24వ తేదీల్లో పుట్టినవారు గుండెకి సంబంధించిన ఇబ్బందులను వృద్ధాప్యంలో ఎదుర్కొంటారు. మహిళల్లో వక్ష (బ్రెస్ట్) సంబంధ సమస్యలు వస్తాయి. చాలామటుకు వీరి నిర్లక్ష్య ధోరణియే వీరి రోగాలకు కారణంగా ఉంటుంది.
ఏడు: 7, 16, 25 వ తేదీల్లో పుట్టినవారు జీర్ణం కాకపోవడం, ఆర్థరైటిస్ వంటి వ్యాధులను వృద్ధాప్యంలో ఎదుర్కొంటారు. చిన్న డిస్టర్బెన్స్ ఎదురయినా కూడా తెగ చిరాకు పడిపోతుంటారు.
ఎనిమిది: 8, 17, 26వ తేదీల్లో పుట్టినవారు బీపీ, పంటినొప్పి, తరచుగా తలనొప్పులు మొదలైన సమస్యలతో బాధపడతారు. కాలేయం, ప్రేగు సమస్యలు వీరిని చుట్టుముడతాయి. పొద్దున్న లేచి వ్యాయామం చేయడం బాగా కలిసొస్తుంది.
తొమ్మిది: 9, 18, 27 వ తేదీల్లో పుట్టినవారు చాలా సున్నితంగా ఉంటారు. వీరికి అన్ని రకాల జ్వరాలు ఇబ్బంది పెడుతుంటాయి. కిడ్నీ, గొంతు సంబంధ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆయిల్ ఫుడ్స్ ముట్టకోకపోతే వీరికి మంచిది.