సమ్మక్క ఆనకట్ట నుంచి 141 టీఎంసీలు తరలించాలన్న ప్రతిపాదనపై జాతీయ జల అభివృద్ధి సంస్థ భాగస్వామ్య రాష్ట్రాలతో బెంగళూరులో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, తదితర రాష్ట్రాల అధికారులను ఆహ్వానించారు. తెలంగాణ నుంచి ఈఎన్సీ మురళీధర్, ఇతర ఇంజనీర్లు సమావేశానికి హాజరుకానున్నారు.
కొత్త ప్రతిపాదనను ఎన్‌డబ్ల్యూడీఏ ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు పంపింది. ఆ ప్రతిపాదనపై రెండు తెలుగు రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయన్నది కీలకంగా మారింది. రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకొని తదుపరి కార్యాచరణను జాతీయ జల అభివృద్ధి సంస్థ చేపట్టనుంది.