సిబిల్ రిపోర్ట్ లో తప్పులుంటే ఇలా కంప్లైంట్ చెయ్యచ్చు..!

-

బ్యాంక్ నుండి లోన్ పొందాలంటే సిబిల్ స్కోర్ చాలా ముఖ్యం. సిబిల్ రిపోర్ట్ లేదా ఇతర ఏజెన్సీలు ఇచ్చే క్రెడిట్ రిపోర్ట్ చాలా అవసరం. అయితే సిబిల్ రిపోర్ట్ ని కొన్ని సంస్థలు ఇస్తుంటాయి. లోన్ అప్లికేషన్ రిజెక్ట్ చెయ్యాలా అనే వాటి కోసం లోన్ సాంక్షన్ చేయడం కోసం ఇది ఎంత ముఖ్యమో మనకు తెలుసు. కానీ ఒక్కోసారి పొరపాట్లు వస్తుంటాయి.

దీని వల్ల లోన్ రావడంలేదు. అలానే క్రెడిట్ కార్డులను కూడా ఇవ్వడంలేదు. ఇలా కొన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. అయితే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు ఇచ్చే రిపోర్టుల్లో కనుక తప్పులుంటే ఇలా కంప్లైంట్ చెయ్యచ్చట. మరి అది ఎలా అనేది చూద్దాం.

రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్‌కు ఎవరైనా ఈ సమస్యలు ఉంటే కంప్లైంట్ చేయొచ్చు. అయితే ఈ తప్పులపై క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు ఫిర్యాదు చేసినా కొన్నిసార్లు రెస్పాన్స్ ఉండడం లేదు. అందుకోసమే వారికి ఆర్‍‌బీఐ ఏర్పాటు చేసిన అంబుడ్స్‌మన్ హెల్ప్ అవుతుంది. ఇది ఉండడం వారికి రిలీఫ్ ని ఇస్తోంది. కంప్లైంట్ కి సొల్యూషన్ కూడా వస్తోంది.

ఎలా ఫిర్యాదు చెయ్యాలి..?

ఫిర్యాదు చేసేందుకు వేర్వేరు పద్ధతులు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చెయ్యడానికి https://cms.rbi.org.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి కంప్లైంట్ చెయ్యచ్చు. లేదా [email protected] ఇమెయిల్ ఐడీకి కంప్లైంట్ ఇవ్వచ్చు. 14448 టోల్ ఫ్రీ కి కాల్ చేసైనా కంప్లైంట్ చేసేయచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news