ఫేక్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో మైనర్ బాలికల అశ్లీల ఫోటోలు

-

సామాజిక వెబ్సైట్ ఇంస్టాగ్రామ్ లో నకిలీ అకౌంట్ తో మైనర్ బాలికల అశ్లీల ఫోటోలు పెట్టిన ఓ యువకుడిని సైబర్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పఠాన్ చెరువుకు చెందిన కోటగిరి హర్షిత్ అనే యువకుడు ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి మైనర్ బాలికల అశ్లీల ఫోటోలు పెడుతూ వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో ఓ మహిళ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు కోటగిరి హర్షిత్ అనే యువకుడిని అరెస్టు చేశారు. అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. ఫేక్ అకౌంట్ లతో వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news