తరం ముగిసిన వేళ.. తెలుగు ప్రేక్షకుడు తల్లడిల్లిన వేళ..

-

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కోతరంలో కొందరు నటులు సూపర్ స్టార్లుగా నిలిచిపోయారు. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోలు ఎవరంటే.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ పేర్లు చెబుతారు. వీళ్లంతా ఈ తరంలో తమదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. అలాగే వీరి ముందుతరంలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తమ సత్తా చాటారు. ఇంకొంచెం ముందుకు వెళితే మన మొదటి తరం స్టార్ హీరోలుగా నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణ నిలిచిపోయారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఆ తరం స్టార్ హీరోలు అందరూ దివికేగి తెలుగు ప్రేక్షకుల్ని ముంచేశారంటూ తల్లడిల్లిపోతున్నారు అభిమానులు..

గడిచిన వందేళ్ళ తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి తరం నటులు అందరూ వెళ్లిపోవడం బాధాకరమైన విషయమనే చెప్పాలి. అయితే సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఆ బాధ తెలుగు ప్రజలకు మరింత ఎక్కువైంది. ఆ తరంలో హీరోలంతా ఒక్కొక్కరిగా వెళ్ళిపోతుంటే తెలుగు ప్రేక్షకులు తట్టుకోలేకపోతున్నారు.. నందమూరి తారక రామారావు గారు 1996లో కొన్ని కారణాలతో తను చాలించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తెలుగు ప్రజానీకం ఒక్కసారిగా నివ్వెరపోయింది. అలాంటి మహానటుడు చనిపోవటాన్ని జీర్ణించుకోలేకపోయారు.. ఆ బాధ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల్ని విడిచిపోవడం లేదు.. అలాగే అలనాటి అందాల నటుడు శోభన్ బాబు అకస్మాత్తు మరణం కూడా ఆయన అభిమానుల్ని ఎంతగానో కలిసి వేసింది.

2008లో ఆయన ఇంటి మేడ మెట్ల మీద నుంచి జారి చనిపోయినప్పుడు అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.. 2014లో అక్కినేని నాగేశ్వరరావు క్యాన్సర్ తో పోరాడి మరణించారు. ఆ సమయంలో అక్కినేని కుటుంబంతోపాటు ఆయన అభిమానులు కూడా ఎంతోగానో బాధపడ్డాను.. అలాగే ఇదే ఏడాది సెప్టెంబర్లో కృష్ణంరాజు మరణం తెలుగు అభిమానుల్ని ఎంతగానో కలిసి వేసింది. ఆ విషయాన్ని జీర్ణించుకోకముందే రెండు నెలలు తిరగకుండా సూపర్ స్టార్ కృష్ణ మరణం అందరికీ తట్టుకోలేని బాధ మిగిల్చింది.. కృష్ణ మరణంతో ఆ తరం హీరోల శకం ముగిసిపోయింది అంటూ తెలుగు ప్రేక్షకులు తల్లడిల్లిపోతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news